నాని డైరెక్టర్ తో శర్వానంద్ ఫిక్స్

Sunday,November 19,2017 - 04:06 by Z_CLU

లేటెస్ట్ ‘మహానుభావుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శర్వా నెక్స్ట్ సినిమాను సెట్స్ పై పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రెజెంట్ సుధీర్ వర్మతో ఓ సినిమా చేయబోతున్న శర్వా మరో వైపు హను రాఘవపూడి తో కూడా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

‘లై’ తర్వాత హను రాఘవపూడి నానితో ఓ సినిమా చేస్తాడనే వార్త వినిపించింది. మిలటరీ బ్యాక్ డ్రాప్ లో హనుతో ఓ సినిమా చేయబోతున్నట్లు నాని కూడా ప్రకటించాడు. అయితే ప్రెజెంట్ నాని ఓ రెండు సినిమాలతో బిజీ అవ్వడంతో ఈ లోపు శర్వాతో ఓ సినిమా చేయబోతున్నాడట హను.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో నేపాల్ లో షూటింగ్ జరుపుకోనుందని, ఈ సినిమాలో శర్వా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుందని సమాచారం. సో నాని డైరెక్టర్ శర్వా ఫిక్స్ అన్నమాట.