'రంగస్థలం' సెట్లో మెగాస్టార్ సందడి
Wednesday,September 20,2017 - 02:30 by Z_CLU
ప్రస్తుతం సుకుమార్ తో ‘రంగస్థలం’ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. విల్లేజ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్ లోకి రాజమౌళి తో కలిసి ఎంట్రీ ఇచ్చి సందడి చేశాడు మెగాస్టార్. సినిమా ప్రారంభమై చాలా నెలలే కావొస్తున్నా ఇంతవరకూ సెట్ లో అడుగుపెట్టని చిరు సడెన్ గా రావడంతో ఆశ్చర్యానికి గురైన యూనిట్ సంతోషంలో మునిగిపోయింది.

ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న భారీ షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు జగపతి బాబు , సమంత మరి కొందరు నటులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది యూనిట్. ఇక చరణ్ ఈ సినిమాలో ఎలా నటిస్తున్నాడా.. అనే సందేహానికి చెక్ పెట్టడానికి సెట్ లో చరణ్ క్యారెక్టర్ పై క్లారిటీ తెచ్చుకున్నాడు చిరు. ప్రస్తుతం ఈ సినిమా సెట్ లో రాజమౌళి తో కలిసి సుకుమార్ టీంతో ముచ్చటిస్తున్న చిరు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ మెగా ఫాన్స్ లో జోష్ తీసుకొచ్చాయి.