రాజ్ తరుణ్ కొత్తగా ఉన్నాడు...

Friday,June 29,2018 - 05:56 by Z_CLU

రాజ్ తరుణ్ ‘లవర్’ టీజర్ రివీలయింది. అల్టిమేట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ పోనీటేల్ హెయిర్ స్టైల్ తో కొత్తగా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ లో రాజ్ తరుణ్ లుక్స్ రివీలైనా, ఈ టీజర్ లో హీరో క్యారెక్టరైజేషన్ ని రివీల్ చేశారు ఫిల్మ్ మేకర్స్.

42 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ లో హీరో అమ్మాయిని చూసి ప్రేమలో పడటం దగ్గర నుండి బిగిన్ అయితే, అమ్మాయిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసే ‘లవర్’ లా రాజ్ తరుణ్ ని ప్రెజెంట్ చేశారు ఫిల్మ్ మేకర్స్. ఇకపోతే సినిమాలో హై ఇంపాక్ట్ క్రియేట్ చేసే కాంఫ్లిక్ట్ ఏమిటన్నది ఈ టీజర్ లో ఏ మాత్రం రివీల్ చేయని, ఆడియెన్స్ లో  క్యూరాసిటీ రేజ్ చేస్తుంది.

అనీష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన రిద్ధి కుమార్ హీరోయిన్ గా నటిస్తుంది. అంకిత్ తివారి, సాయి కార్తీక్, తనిష్ బగ్చి, అర్కో, రిషి రిచ్ ఐదుగురు  మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది.