జీ సినిమాలు ( 30th జూన్ )

Friday,June 29,2018 - 10:03 by Z_CLU

అవును 2

నటీనటులు : పూర్ణ, హర్షవర్ధన్ రాణే

ఇతర నటీనటులు : రవి బాబు, సంజన గల్రాని, నిఖిత తుక్రాల్, రవి వర్మ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 3 ఏప్రిల్ 2015

రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ అవును సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది అవును 2. ఈ సినిమా కూడా రవిబాబు మార్క్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. హీరోయిన్ పూర్ణ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

==============================================================================

 

భగీరథ 

నటీనటులు : రవి తేజ, శ్రియ

ఇతర నటీనటులు :  ప్రకాష్ రాజ్, నాజర్,

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్

ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి

రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005

రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా          ‘భగీరథ’. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవి తేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

=============================================================================

 

కొత్త బంగారు లోకం 

నటీనటులు : వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, ఆహుతి ప్రసాద్, రజిత, బ్రహ్మానందం మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జె. మేయర్

డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 9 అక్టోబర్ 2008

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన కొత్త బంగారు లోకంలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్ గా నటించారు. రిలీజయిన ప్రతి సెంటర్ లోను అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

==============================================================================

ఒక ఊరిలో

నటీనటులు : తరుణ్, రాజా, సలోని

ఇతర నటీనటులు : చంద్ర మోహన్, నరేష్, కల్పన, రామరాజు, యమునా, నిరోషా

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : రమేష్ వర్మ

ప్రొడ్యూసర్ : చంటి అడ్డాల

రిలీజ్ డేట్ : 1 జూలై 2005

లవర్ బాయ్ తరుణ్, తెలుగమ్మాయి సలోని జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ ఒక ఊరిలో. ఒక అందమైన ఊరిలో మొదలైన ప్రేమకథ ఏ మలుపు తిరిగింది. చివరికి ఏమైంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపించుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలెట్.

=============================================================================

కూలీ నం 1

నటీనటులు : వెంకటేష్, టాబూ

ఇతర నటీనటులు : రావు గోపాల్ రావు

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : K. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. సురేష్

రిలీజ్ డేట్ : 12 జూన్ 1991

వెంకటేష్ హీరోగా K. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన కలర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ కూలీ నం 1. ఒక సాధారణ కూలీ, పొగరుబోతులైన తండ్రీ కూతుళ్ళ అహాన్ని ఎలా నేలకూల్చాడనే ప్రధానాంశంతో తెరకెక్కిందే ఈ సినిమా. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

==============================================================================

స్పైడర్ మ్యాన్ – హోమ్ కమింగ్ 

నటీనటులు : టామ్ హాలండ్, మైకేల్ కీటన్

ఇతర నటీనటులు : జాన్ ఫెవరు, జెండాయా, డోనాల్డ్ గ్లోవర్, టైన్ డ్యాలీ, మెరీసా టోమెయి, రాబర్ట్ డౌనీ మరియు తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్ : మైకేల్ గియాచినో

డైరెక్టర్ : జాన్ వాట్స్

ప్రొడ్యూసర్ : కెవిన్ ఫీజీ, ఏమీ పాస్కల్

రిలీజ్ డేట్ : జూలై 7, 2017

పర్ఫెక్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో తెరకెక్కిన ఈ సినిమాలో పీటర్ పార్కర్ ఫీట్స్ హైలెట్ గా నిలిచాయి. ఒక ఆర్డినరీ స్కూల్ లో చదువుకునే స్టూడెంట్, తనకున పవర్స్ తో అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో తయారయ్యే ప్రమాదకరమైన వెపన్స్ తయారీని ఎలా అడ్డుకున్నాడనేదే ఈ సినిమా ప్రధానాంశం.

=============================================================================

తులసీ దళం

నటీనటులు : నిశ్చల్, వందన, R.P. పట్నాయక్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, దువ్వాసి మోహన్, అనిత చౌదరి

మ్యూజిక్ డైరెక్టర్ : R.P. పట్నాయక్

డైరెక్టర్ : R.P. పట్నాయక్

ప్రొడ్యూసర్ : R.P. పట్నాయక్

రిలీజ్ డేట్ : 11 మార్చి 2016

 ఫార్ములా సినిమాలకు భిన్నంగా ఉంటాయి R.P. పట్నాయక్ సినిమాలు. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన తులసీదళం 2016 లో రిలీజైన బెస్ట్ సినిమాలలో ఒకటి. సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్స్ లో నటిస్తూనే, ఈ  సినిమాకి దర్శకుడు, నిర్మాత, సంగీతం అన్ని తానాయి చూసుకున్నాడు R.P. పట్నాయక్.