గోపీచంద్ ‘పంతం’ రిలీజ్ కి లైన్ క్లియర్

Friday,June 29,2018 - 05:01 by Z_CLU

గోపీచంద్ ‘పంతం’ సెన్సార్ క్లియరయింది. జూలై 5 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా U/A సర్టిఫికెట్ పొందింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఓవరాల్ గా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఫిల్మ్ మేకర్స్, సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

గోపీచంద్ కరియర్ లో 25 వ సినిమా కావడంతో న్యాచురల్ గానే ఈ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. రాజకీయాలు, కరప్షన్ లాంటి అంశాలపై తెరకెక్కిన ఈ సినిమా, గోపీచంద్ రియల్ స్టామినాని ఎలివేట్ చేయడం గ్యారంటీ అంటున్నాయి ఇన్ సైడ్ సోర్సెస్. గోపీచంద్ ఈ సినిమాలో దేనికి  ‘పంతం’ పట్టాడనేది ఇంకో వారం రోజుల్లో తెలిసిపోతుంది.

 

గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా K. చక్రవర్తి డైరెక్షన్ లో తెరకెక్కింది. గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.