పని పూర్తిచేసిన 'లవర్'

Wednesday,July 04,2018 - 11:57 by Z_CLU

ఈ ఏడాది అప్పుడే ముచ్చటగా మూడో సినిమా రెడీ చేశాడు హీరో రాజ్ తరుణ్. సంక్రాంతి కానుకగా రంగులరాట్నం, సమ్మర్ ఎట్రాక్షన్ గా రాజుగాడు సినిమాల్ని రిలీజ్ చేసిన ఈ యంగ్ హీరో, ఇప్పుడు లవర్ గా మనముందుకు రాబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఇవాళ్టితో టోటల్ షూటింగ్ పూర్తి అయింది.

చివరి రోజు షూట్ లో భాగంగా హాస్పిటల్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సన్నివేశాలు తీశారు. ఈ షూట్ తో టోటల్ సినిమాకు ప్యాకప్ చెప్పేసింది యూనిట్. ఇక జులై 20న సినిమాను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

రాజ్ తరుణ్ డిఫరెంట్ మేకోవర్ లో కనిపిస్తున్న ఈ సినిమాతో రిద్దీ కుమార్ టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అవుతోంది. అనీష్ కృష్ణ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ఐదుగురు సంగీత దర్శకులు పాటలు కంపోజ్ చేశారు. టీజర్ తో పాటు సాంగ్స్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది.