గోపీచంద్ ఇంటర్వ్యూ

Wednesday,July 04,2018 - 01:24 by Z_CLU

ఈ నెల 5 న గ్రాండ్ గా రిలీజవుతుంది గోపీచంద్ పంతం. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రిలీజైన ట్రైలర్ తో మ్యాగ్జిమం ఇంప్రెస్ చేసేసింది. భారీ అంచనాల మధ్య రిలీజవుతున్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు గోపీచంద్. అవి మీకోసం…

 కరెక్టా కాదా అనేది…

ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం… అది అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నా… రిజల్ట్స్ సినిమా రిలీజవ్వగానే తెలిసిపోతుంది…

అది తెలిసిపోతుంది…

సినిమా చూశాక మన సొసైటీలో ఇలా జరుగుతుందా… దీన్ని సాల్వ్ చేస్తే బావుంటుంది అనే ఆలోచన ప్రతి ఒకరిలో కలుగుతుంది.

 

అలా అస్సలు అనుకోలేదు…

25 వ సినిమా కాబట్టి కావాలని ఇలాంటి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాను పిక్ చేసుకోలేదు… లక్కీగా ఈ సినిమా 25 వ సినిమా అయింది.

అదే నా ఫీలింగ్…

నేను ఏ సినిమా చేసినా అది నా ఫస్ట్ మూవీగా ట్రీట్ చేస్తాను.. అంతే డెడికేటెడ్ గా చేస్తాను. నేను చేసిన సినిమాల్లో కొన్ని సక్సెస్ అవ్వకపోవచ్చు కానీ, అందులో ఒక్కటి కూడా బ్యాడ్ మూవీ ఉండదు…

అసలు నమ్మలేదు…

చక్రవర్తి స్టోరీ చెప్పినప్పుడు చాలా బాగా చెప్పాడు… కాకపోతే ఫస్ట్ మూవీ కాబట్టి చెప్పినంత ఎఫెక్టివ్ గా తీస్తాడో లేదోనన్న అనుమానం ఉంది… కానీ సినిమా చూస్తే.. చెప్పిన దానికన్నా చాల రెట్లు బెటర్ గా తీశాడు…

 

ఎప్పుడెప్పుడా అనిపించింది…

సినిమాలో డైలాగ్స్ చాలా బావున్నాయి… కొన్ని సీన్స్ అయితే అసలెప్పుడు చేస్తానా అని వెయిట్ చేసేవాణ్ణి… చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను కొన్ని సీన్స్….

అబద్ధం చెప్పినట్లే…

ప్రతి సినిమా రిలీజ్ టైమ్ లో టెన్షన్ ఉంటుంది… ఈ సినిమాకి కూడా ఉంది. నాకు ఏ మాత్రం టెన్షన్ లేదు అని చెప్తే నేను అబద్ధం చెప్పినట్టే అవుతుంది.

ఇన్నాళ్ళకు కుదిరింది…

నాన్నగారి సినిమాల్లా సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు చేయొచ్చుగా అని అందరూ అడుగుతుంటారు… వాళ్లకు ప్రతిసారి ఒకటే చెప్పేవాణ్ణి…  నా దగ్గరికి అసలు అలాంటి కథలు రావట్లేదు అని చెప్పేవాణ్ణి… ఇన్నాళ్ళకు కుదిరింది..

 

నెక్స్ట్ మూవీ…

B.V.S.N. ప్రసాద్ గారి బ్యానర్ లో కుమార్ డైరక్షన్ లో నెక్స్ట్ సినిమా ఉంటుంది. కుమార్ కి ఇది ఫస్ట్ మూవీ… అది పక్కా  రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్.

అందుకే గోపీచంద్…

మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ అయితే బావుంటుందనే ఆలోచన నాదే… సాంగ్స్ విషయానికి వచ్చేసరికి చక్రవర్తికి ఎలాంటి సాంగ్స్ కావాలో ముందే క్లారిటీ ఉంది.. BGM గోపీ సుందర్ అయితే బాగా చేస్తాడని నాకు ముందు నుండే క్లారిటీ ఉంది…

అసలు ఆ ఆలోచన లేదు…  

ప్రస్తుతానికి నెగెటివ్ రోల్స్ చేసే ఆలోచన లేదు. చేసే సినిమాలే డిఫెరెంట్ గా ఎంటర్ టైన్ మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నా…