రేపే రాజ్ తరుణ్ 'లవర్' ఆడియో

Saturday,June 23,2018 - 03:56 by Z_CLU

రాజ్ తరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ  ‘లవర్’.. ‘అలా ఎలా’ ఫేం అనీష్ కృష్ణ డైరెక్షన్ లో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో రేపే విడుదల కానుంది. హైదరాబాద్ లో స్టేట్ గ్యాలరీ లో ఈ సినిమా పాటలను విడుదల చేయనున్నారు. ఈ ఆడియో ఫంక్షన్ కు టోటల్ టీం హాజరు కానున్నారు. ఈ సినిమాకు  అంకిత్ తివారి, సాయి కార్తీక్, తనిష్ బగ్చి, అర్కో, రిషి రిచ్ ఐదుగురు కలిసి మ్యూజిక్ అందించారు.

రాజ్ తరుణ్ సరసన రిద్ది కుమార్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా  ఒక పాట మినహా షూటింగ్ పూర్తిచేసుకుంది. దిల్ రాజు సమర్పణలో  హర్షిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.