సమ్మర్ ఎట్రాక్షన్ గా మహేష్ మూవీ

Wednesday,July 04,2018 - 11:43 by Z_CLU

ఈ వేసవికి భరత్ అనే నేను సినిమాతో మెస్మరైజ్ చేసిన మహేష్, వచ్చే వేసవికి అప్పుడే బెర్త్ కన్ ఫర్మ్ చేసుకున్నాడు. తన అప్ కమింగ్ మూవీని 2019 సమ్మర్ ఎట్రాక్షన్ గా తీసుకురాబోతున్నాడు. ఈ మేరకు ఏప్రిల్ 5న ముూవీని రిలీజ్ చేయబోతున్నట్టు, నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అఫీషియల్ గా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసింది.

మహేష్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ 25వ సినిమా కేవలం సమ్మర్ ఎట్రాక్షన్ మాత్రమే కాదు. ఉగాది స్పెషల్ కూడా. అలా ఇటు ఫెస్టివల్, అటు సమ్మర్ రెండూ కలిసొచ్చేలా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉందంటూ మొన్నటివరకు రూమర్లు వినిపించాయి. వాటికి చెక్ చెబుతూ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ డెహ్రూడూన్ లో జరుగుతోంది. మహేష్, పూజా హెగ్డే, అల్లరి నరేష్ పై కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.