ఫస్ట్ లుక్ తో ఎట్రాక్ట్ చేస్తున్న రాజ్ తరుణ్

Saturday,June 16,2018 - 12:01 by Z_CLU

రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ ‘లవర్’ ఫస్ట్ లుక్ రిలీజైంది. రాజ్ తరుణ్ , రిద్ది కుమార్ క్యారెక్టర్స్ ను  ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది. ‘అలా ఎలా’ ఫేం అనిష్ కృష్ణ డైరెక్షన్ లో యూత్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ సాంగ్ మినహా షూటింగ్ ఫినిష్ చేసుకుంది. త్వరలోనే బ్యాలెన్స్ సాంగ్ ను షూట్ చేసి రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారు మేకర్స్.

దిల్ రాజు ప్రొడక్షన్ లో  శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో పోనిటైల్ హెయిర్ స్టైల్ తో  స్టైలిష్  క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేయబోతున్నాడు రాజ్ తరుణ్.