PelliSandadi - మళ్ళీ మొదలవుతుంది

Friday,October 09,2020 - 03:36 by Z_CLU

శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ హీరోహీరోయిన్లుగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కించిన PelliSandadi ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం అందుకున్న ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. అవును.. తాజాగా అదే టైటిల్ తో ఈ సీక్వెల్ ను ప్రకటించారు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ‘పెళ్లి సందడి’ ని పాటలతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ చేసిన MM Keeravani నే ఈ సీక్వెల్ కి కూడా సంగీతం అందించనున్నారు. కే కృష్ణ మోహన్ రావు సమర్పణలో RK Films మరియు Arka Media బ్యానర్స్ పై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే సినిమాలో నటించబోయే  నటీనటుల వివరాలు తెలియజేస్తామంటున్నారు మేకర్స్.