శ్రీకాంత్

Thursday,February 22,2018 - 05:43 by Z_CLU

శ్రీకాంత్ మేక ప్రముఖ కథానాయకుడు.  22 మార్చ్ 1968 లో కర్ణాటక రాష్ట్రంలో  గంగావతిలో జన్మించారు. పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలో నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘సీతా రత్నం గారి అబ్బాయి’,’పెళ్ళాం చెబితే వినాలి’,’ప్రెసిడెంట్ గాడి పెళ్ళాం’,’ఆశయం’,’వారసుడు’,’కొండ పల్లి రాజా’,’అబ్బాయి గారు’,’ఆమె’ వంటి సినిమాల్లో నటుడిగా నటించాడు.  ఆ తర్వాత కథానాయకుడిగా ‘తాజ్ మహల్’,’పెళ్లి సందడి’,’వినోదం,’తాళి’,ఎగిరే పావురం’,’ఆహ్వానం’,’ఊయల’,’కన్యాదానం’ వంటి సినిమాల్లో నటించాడు. శ్రీకాంత్ నటుడిగా  వరకూ 120 కి పైగా సినిమాల్లో నటించారు.