PelliSandaD - మేజిక్ రిపీట్ అవుతుందా?

Tuesday,October 12,2021 - 03:50 by Z_CLU

Will PelliSandaD recreates the same magic?

కొన్ని క్లాసిక్ సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అదే టైటిల్ తో అలాంటి సినిమాలను మళ్ళీ తీయడానికి ఎంతో దైర్యం కావాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రేక్షకులు పెదవి విరుస్తారు. ఇప్పుడు పెళ్లి సందD కి సంబంధించి ఇదే చర్చ నడుస్తుంది. దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఇరవై ఏళ్ల క్రితం శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లి సందడి’ పెద్ద విజయం అందుకుంది. చాలా చోట్ల అరుదైన రికార్డు నేలకోలిపింది కూడా. ఇప్పటికీ పెళ్లి సందడి రికార్డులు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి క్లాసిక్ సినిమాను మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత టచ్ చేసి శ్రీకాంత్ తనయుడి రోషన్ తో తీశారు రాఘవేంద్ర రావు.

రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యావేక్షణలో గౌరీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 15న థియేటర్స్ లోకి వస్తుంది. సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ‘నువ్వంటే నాకు ప్రేమ’ పాట మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకున్నాయి. అంతా బాగానే ఉంది కానీ అప్పటి మేజిక్ మళ్ళీ ఈ సినిమాకు కనిపిస్తుందా ? ఆ రేంజ్ లో ఆడుతుందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి పెళ్లి సందడి సినిమా కూడా ఓ చిన్న సినిమాగానే రిలీజై ఘన విజయం అందుకుంది.

Raghavendra Rao PellisandaD movie

మరి ఆ కేటగిరీలోనే ఇప్పుడు తండ్రి లా రోషన్ కూడా ఈ సినిమాతో ఘన విజయం అందుకొని గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తాడా ? అనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమాతో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు నటుడిగా మారారు. ఫర్ ఫస్ట్ టైం ఆయన స్క్రీన్ పై నటుడిగా కనిపించబోతున్నాడు. సో అటు రోషన్ కే కాదు ఇటు రాఘవేంద్ర రావు కి కూడా నటుడిగా ఈ సినిమా విజయం అవసరం. మరి చూడాలి ఈ ‘పెళ్లి సందD’ ఆ ‘పెళ్లి సందడి’ లా మేజిక్ రిపీట్ చేస్తుందా?

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics