#Prabhas21 - మరో బిగ్ సర్ ప్రైజ్

Friday,October 09,2020 - 02:43 by Z_CLU

మహానటి దర్శకుడు Nag Ashwin డైరెక్షన్ లో Prabhas తన 21వ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ నుండి తాజాగా బిగ్ సర్ ప్రయిజ్ ఇచ్చారు మేకర్స్. సినిమాలో ఓ కీ రోల్ కోసం BigB Amitabh Bhachchan ను తీసుకున్నట్లు ప్రకటించారు. Legend లేకుండాLegendery Cinema తీయలేమని ఓ వీడియో ద్వారా చెప్తూ అమితాబ్ కు బిగ్ వెల్ కం చెప్పారు.

దీంతో ఇద్దరు ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. అయితే సినిమాలో అమితాబ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..? ప్రభాస్ కి అమితాబ్ మధ్య ఎలాంటి ట్రాక్ ఉంటుందనేది తెలియాల్సి ఉంది. Vyjayanthi Movies బ్యానర్ పై అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో Deepika Padukone హీరోయిన్ గా నటిస్తుంది.

Also Read – ప్రభాస్ ప్రాజెక్టులోకి సింగీతం

తెలుగులో రీసెంట్ గా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించారు అమితాబ్. ఆ మూవీ తర్వాత బిగ్ బి చేస్తున్న మరో తెలుగు సినిమా ఇదే.