#PelliSandaD టీజర్ టాక్ !

Tuesday,September 14,2021 - 05:44 by Z_CLU

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యావేక్షణలో తెరకెక్కుతున్న ‘పెళ్లి సందD’ సినిమా నుండి టీజర్ రిలీజ్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఆల్బం నుండి విడుదలైన రెండు సాంగ్స్  సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా అక్కినేని నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ అయిన టీజర్ కూడా ఆకట్టుకుంది. టీజర్ తోనే సినిమా కథాంశాన్ని చెప్పేశారు.

హీరో హీరోయిన్ మధ్య ప్రేమ , వారి ప్రేమకి పెద్దలు అడ్డు చెప్పడం, ముఖ్యంగా అమ్మాయి తండ్రిని హీరో ఎలా ఒప్పించాడు అనే కథతో తెరకెక్కిన సినిమా అని అర్థమవుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు చక్కని కామెడీ కూడా ఉండనుందని టీజర్ కట్ తో తెలిపారు. ముఖ్యంగా సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాన్స్ ఏ మోతాదులో ఉండనుందో కొన్ని షాట్స్ తో చూపించారు. అలాగే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయని చెప్పేలా ఫైట్స్ కూడా కట్ చేశారు.  హీరోయిన్ తండ్రి గా ప్రకాష్ రాజ్ కనిపించనున్నాడు.  సినిమాలో మంచి ప్యాడింగ్ ఉందని తెలిసేలా మిగతా క్యారెక్టర్స్ ని కూడా టీజర్ లో చూపించారు. రాజేంద్ర ప్రసాద్ , రావు రమేష్ లాంటి దిగ్గజాలతో పాటు ఇంకా చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాలో నటించారనేది తెలుస్తుంది. ఫైనల్ గా కీరవాణి కంపోజ్ చేసిన పాపులర్ సాంగ్ బిట్ తో టీజర్ ఎండ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో హంగామా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుకుట్టుంది.

K రాఘవేంద్ర రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్గౌలగడ్రీడ , ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ సినిమాతో గౌరీ రోనంకి దర్శకురాలిగా పరిచయమవుతుంది. రోషన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాఘవేంద్ర రావు వశిష్ట అనే ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

 

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics