నవ్విస్తే చాలు.. నిరూపించిన ‘కాంచన 3’

Friday,April 26,2019 - 10:03 by Z_CLU

‘జెర్సీ’ తో పాటే రిలీజయింది ‘కాంచన 3’. ఫస్ట్ షో తోనే ‘జెర్సీ’ క్రియేట్ చేసిన వైబ్స్ చూస్తే ‘కాంచన 3’ ఫోకస్ లోకి రావడం కష్టమే అనుకున్నారంతా. కానీ ‘జెర్సీ’ కి గట్టి కాంపిటీషనే ఇచ్చింది ‘కాంచన 3’. సినిమాలో హారర్ ఎలిమెంట్స్ తో పాటు, కామెడీతో కూడా బాక్సాఫీస్ దగ్గర వైబ్స్ క్రియేట్ చేస్తుంది ‘కాంచన 3’.

సాధారణంగా డబ్బింగ్ సినిమాలంటే క్రేజ్ అంతగా క్రియేట్ అవ్వదు. కాంచన ఫ్రాంచైజీకి మాస్ ఆడియెన్స్ లో క్రేజ్ ఉన్నా, ఒక్క తెలుగు సినిమా పక్క థియేటర్ లో కనిపించినా ఫోకస్ అటువైపు మళ్లుతుంది. కానీ ‘కాంచన 3’కి ‘కిర్రాక్ కామెడీ’ అనే ఎలిమెంట్ కూడా యాడ్ అవ్వడంతో, ఒక్కసారిగా సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది

సినిమాలోని కోవై సరళ కాంబినేషన్ లో సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. దానికి తోడు  ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ కూడా తోడవ్వడంతో ‘కాంచన 3’ ఫుల్ మీల్స్ ఎంటర్ టైనర్ అనిపించుకుంది.

ఒక్క టాలీవుడ్ స్టార్ లేకపోయినా ‘కాంచన 3’ బాక్సాఫీస్ దగ్గర కురిపిస్తున్న వసూళ్ళ వర్షం గమనిస్తే, కాస్త జెన్యూన్ కామెడీతో నవ్విస్తే చాలు సినిమా సక్సెస్ గ్యారంటీ అని మరోసారి రుజువైంది.