వంద సార్లు చూసాను -లారెన్స్

Wednesday,April 24,2019 - 06:37 by Z_CLU

మొన్న శుక్రవారం ‘జెర్సీ’ తో పాటు థియేటర్స్ లో కొచ్చింది ‘కాంచన 3’.. రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ హార్రర్ కామెడీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ వసూళ్లు చేస్తూ గ్రాండ్ సక్సెస్ దిశగా వెళ్తోంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు మేకర్స్. సక్సెస్ మీట్ లో తన హ్యాపీనెస్ ని ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు లారెన్స్. ఆ విశేషాలు లారెన్స్ మాటల్లోనే…

మీకు నచ్చడం కోసం

ఈ సినిమా మీరు రెండు సార్లు  లేదా మూడు సార్లు చూసి ఉంటారు. కానీ నేనొక వంద సార్లు చూసి ఉంటాను. దానికి కారణం మీకు నచ్చుతుందా..? లేదా అని సందేహం. ఇప్పుడు మీ అందరికీ సినిమా నచ్చినందుకు సంతోషంగా ఉంది.

రెండేళ్ళు కష్టపడ్డాం

ఈ సినిమా కోసం రెండేళ్ళు కష్టపడ్డాం. థియేటర్స్ లో సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఎంజాయ్ చేయడం వల్ల సినిమాను కొనుక్కున్న డిస్ట్రి బ్యూటర్స్ చాలా హ్యాపీ గా ఉన్నారు. వారి మాటలు వింటుంటే వారు ఎంత సంతోషంగా ఉన్నారో అర్థమవుతోంది.

 

ఆయనకి మంచి పేరొచ్చింది

ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసినందుకు నిర్మాత మధు గారికి థాంక్స్. ఆయన చాలా మంచి మనిషి. ఆయనికి ఈ సినిమా మంచి పేరు తెచ్చింది. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలి.

పెద్ద సినిమాలు చేయాలి

సినిమాలో హీరోయిన్ గా చేసిన వేదిక కామెడీ , డాన్సు అన్ని బాగా చేసింది. ఆమె పెద్ద హీరోలతో పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. నిక్కీ ఇప్పటికే రెండు హిట్స్ అందుకుంది. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా హిట్టయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా పెద్ద హిట్టయింది. లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. తను కూడా పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.

స్ట్రైట్ సినిమాలాగే

టెక్నీషియన్స్ అందరూ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయ్యింది. డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా స్ట్రైట్ సినిమాలాగే చెప్పారు. కెమెరా మెన్ సర్వేశ్ గారు అలాగే సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థాంక్స్.