ఏప్రిల్ బాక్సాఫీస్ రివ్యూ

Wednesday,May 01,2019 - 12:02 by Z_CLU

ఏప్రిల్ బాక్సాఫీస్ కి సమ్మర్ సీజన్ బాగా కలిసొచ్చింది. ఈ నెలలో  5 సినిమాలు హిట్ అయ్యాయి. ఓ రకంగా ఏప్రిల్ బాక్సాఫీస్ ఆల్మోస్ట్ మంచి పాజిటివ్ బజ్ తో ముగిసింది.

 

ప్రేమకథా చిత్రమ్ 2 : టైటిల్ పెంచిన ఎక్స్ పెక్టే షన్స్ బాక్సాఫీస్ పై ఎఫెక్ట్ చూపించాయి. టైటిల్ అనౌన్స్ చేసిన రోజు క్రియేట్ అయిన వైబ్స్, సినిమా రిలీజ్ అయినప్పుడు క్రియేట్ అవ్వకపోవడం ఫస్ట్ వీకెండ్ కే సినిమా ఫ్యూచర్ ని డిసైడ్ చేసింది.

మజిలీ : ఏప్రిల్ ఫస్టాఫ్ ని ఎమోషనల్ జోన్ లోకి నెట్టేసింది ‘మజిలీ’. పెళ్లి తరవాత  ఫస్ట్ టైమ్ జోడీ కట్టిన చైతూ, స్యామ్ సినిమాపై ఏ స్థాయిలో ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయో, వాటిని 100% రీచ్ అయింది. ఈ స్టార్ కపుల్ కరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అనిపించుకుంది.  

చిత్రలహరి : ఈ సారైనా హిట్ కొడతాడా..? అని ఫ్యాన్స్ ఆత్రంగా చూస్తున్న టైమ్ లో కరెక్ట్ కంటెంట్ తో రిలీజయింది ‘చిత్రలహరి’ సినిమా. వరస ఫ్లాపులతో కాస్త వెనకబడ్డ సాయి తేజ్, మరీ అదరగొట్టే హీరోయిజం ఉన్న కథ కాకుండా న్యాచురాలిటీకి దగ్గరగా ఉండేలా చేసిన ప్రయత్నం ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. మరీ బ్లాక్ బస్టర్ కాదు కానీ టికెట్ కొని సినిమా చూసిన వాళ్లకి బోర్ కొట్టకుండా మ్యానేజ్ చేసింది చిత్రలహరి.

 

జెర్సీ : బెస్ట్ సినిమా చూశాం అన్న ఫీలింగ్ ని కలిగించింది జెర్సీ. రెగ్యులర్ గా సినిమాలు చూడని వాళ్ళను కూడా థియేటర్స్ కి రప్పించింది. రియలిస్టిక్ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన అనుభవాన్ని మిగిల్చింది. ఈ సమ్మర్ లోనే కాదు, ఈ ఏడాది బెస్ట్ మూవీగా నిలిచింది.

కాంచన 3 : ఏప్రిల్ నెలలో రిలీజైన వన్ అండ్ ఓన్లీ మాస్ హారర్  కామెడీ ఎంటర్ టైనర్. B, C సెంటర్లలో అదిరిపోయే కలెక్షన్స్ వసూలు చేసింది. లారెన్స్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు న్యాచురల్ గా ఉన్న కామెడీ ఫ్యామిలీస్ ని కూడా థియేటర్స్ కి రప్పించింది.

ఒక్క ‘ప్రేమ కథా చిత్రమ్ 2’ తప్ప ఈ నెలలో రిలీజైన మెయిన్ మూవీస్ అన్నీ ఆడియెన్స్ ని 100% ఎంటర్ టైన్ చేయడంలో సక్సెస్ అయ్యాయి.