కాంబినేషన్ సక్సెస్ అయితే అంతే

Thursday,May 23,2019 - 12:02 by Z_CLU

సినిమా సక్సెస్ అయితే అందులో నటించిన స్టార్ మోస్ట్ ఫేవరేట్ అయిపోతారు. అలాగే ఆ సినిమాలో ఎంటర్టైన్ చేసిన కాంబోల చుట్టూ కూడా అంతే క్రేజ్ క్రియేట్ అవుతుంది. అందుకే ఆడియెన్స్ పల్స్ కి తగ్గట్టు మళ్ళీ అదే కాంబోని… వీలైతే అదే టైటిల్ ని రిపీట్ చేస్తూ సినిమాలు ప్లాన్ చేస్తారు మేకర్స్.

అభినేత్రి 2 : తమన్నా, ప్రభుదేవాల ‘అభినేత్రి 2’ ఈసారి కూడా గట్టిగానే ఎంటర్టైన్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా చేయడానికి అల్టిమేట్ రీజన్.. అభినేత్రి సక్సెస్ అవ్వడమే. ఈ సినిమాలో ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్ ల కాంబినేషన్ లో జెనెరేట్ అయిన ఫన్ ని ఎన్నిసార్లైనా చూడటాని రెడీగా ఉన్నారు ఆడియెన్స్.

F2: ఏ స్థాయి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. అందుకే కథ కూడా కంప్లీట్ గా అనుకోకముందే దీని సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. అందులో నటించడానికి వెంకీ, వరుణ్ కూడా ఓకే చెప్పేశారు.

కాంచన : మాస్ ఆడియెన్స్ కి మోస్ట్ ఫేవరేట్ ఫ్రాంచైజీ. ఈ వరసలో లారెన్స్ ఎన్ని ‘కాంచన’ లు చేసినా సక్సెస్ గ్యారంటీ అనే స్థాయి డిమాండ్ లో ఉంది. అందుకే లారెన్స్ ప్రతిసారి ఈ ఫ్రాంచైజీ లో ఉన్న నటీనటులనే రిపీట్ చేయడానికి ఇష్టపడుతుంటాడు. అలా ఈ సిరీస్ లో 10 సినిమాలు చేస్తానంటున్నాడు లారెన్స్.

 

గీతాంజలి 2 – నిర్మాత కోన వెంకట్… హీరోయిన్ అంజలి. మళ్ళీ రిపీట్ అవుతున్నారు. పనిలోపనిగా టైటిల్ కూడా రిపీట్ చేస్తున్నారు. అంజలికి ఈ సినిమా ఎంత పేరు తీసుకొచ్చిందో తెలిసిందే. సీక్వెల్ కూడా అదే స్థాయిలో మేజిక్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది.