కొత్త సినిమాతో బాలయ్య రెడీ

Friday,April 26,2019 - 09:06 by Z_CLU

NTR బయోపిక్ తరవాత బాలకృష్ణ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది. వచ్చే నెల గ్రాండ్ గా సెట్స్ పైకి రాబోతున్నాడు బాలయ్య. మాస్ డైరెక్టర్ K.S. రవికుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్.

గతంలోనూ ‘జై సింహా’ సినిమాలో K.S. రవికుమార్ డైరెక్షన్ లో నటించాడు బాలకృష్ణ. ఆ సినిమా తర్వాత మరోసారి రవికుమార్ తో కలిసి పనిచేయబోతున్నాడు. సినిమాలో బాలయ్య సరసన నటించనున్న హీరోయిన్ తో పాటు, మిగతా స్టార్ కాస్ట్ ని ఫైనల్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు మేకర్స్.

‘మే’ నెలలో సినిమాను లాంచ్ చేస్తారు. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై C. కళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తాడు. కేఎస్ రవికుమార్ సినిమాను అఫీషియల్ గా ప్రకటించడంతో…. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య చేయాల్సిన సినిమా ఇంకాస్త లేట్ కానుంది.