'రాధా' ట్రైలర్ హంగామా..

Friday,May 05,2017 - 06:15 by Z_CLU

లేటెస్ట్ గా ‘శతమానం భవతి’ తో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న శర్వానంద్ మే 12న ‘రాధా’ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్. ప్రసాద్ సమర్పణలో భోగవల్లి బాపినీడు నిర్మాతగా చంద్ర మోహన్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రైలర్ తో హంగామా చేస్తుంది…


ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను తాజాగా సోషల్ మీడియా లో రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే టీజర్ తో అందరినీ ఆకట్టుకున్న ‘రాధా’ లేటెస్ట్ గా ట్రైలర్ తో సినిమా పై అంచనాలు పెంచేశాడు..శర్వానంద్ పోలీస్ గా అపాయింట్ అయ్యే సీన్ నుంచి ఎండింగ్ లో మీకు శ్లోకం-సారాంశం కాదురా.. సందేశమే కరెక్ట్ అనే కామెడీ డైలాగ్ వరకూ ఎంటర్టైనింగ్ గా సాగిన ట్రైలర్ ప్రెజెంట్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సోషల్ మీడియా ట్రేండింగ్ అవుతుంది..ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ క్లయిమాక్స్ కి చేరిన మే 6న ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించి సినిమాను మే 12 న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్…