తరుణ్ సినిమా టీజర్ లాంఛ్ చేసిన నాగ్

Friday,May 05,2017 - 05:00 by Z_CLU

ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ చాలా గ్యాప్ తర్వాత మరో లవ్ స్టోరీ తో త్వరలోనే థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.. ‘ఇది నా లవ్ స్టోరీ’ అనే టైటిల్ తో రమేష్ గోపి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది…

త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను లేటెస్ట్ గా కింగ్ నాగార్జున రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ” సినిమా టైటిల్ చాలా నచ్చిందని.. టీజర్ లో విజువల్స్ బాగున్నాయని.. టీజర్ చూస్తుంటే మంచి విజయం సాధించే సినిమా అవుతుందనిపిస్తుందని. తరుణ్ కి సినిమా యూనిట్ అందరికీ అల్ ది బెస్ట్ ” అన్నారు…

మరి గతంలో లవ్ స్టోరీస్ తో యూత్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి సూపర్ హిట్స్ అందుకున్న తరుణ్ ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ అందుకుంటాడో.. చూడాలి..