Virupaksha Movie అంచనాలు పెంచేసిన టైటిల్ గ్లిమ్స్

Wednesday,December 07,2022 - 11:32 by Z_CLU

Virupaksha Title Glimpse impressed with Jr Ntr’s Voice over

అజ్ఞానం భయానికి మూలం , భయం మూడ నమ్మకానికి కారణం.  ఆ నమ్మకమే నిజమైనప్పుడు ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం” అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రిలీజైన సాయి ధరం ‘విరూపాక్ష’ టైటిల్ గ్లిమ్స్ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా సినిమాకు మేకర్స్ ఫిక్స్ చేసిన ‘విరూపాక్ష’ (Virupaksha) టైటిల్ ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేసేలా ఉంది.

టైటిల్ గ్లిమ్స్ లో ఎన్టీఆర్ (Jr NTR) పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో పాటు అజనీష్ లోకనాథ్ టెర్రిఫిక్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. చివర్లో తేజ్ చేతిలో కాగడా పట్టుకొని వచ్చే షాట్ బాగుంది.  సుకుమార్ స్క్రీన్ ప్లే తో  కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మూడనమ్మకాల నేపథ్యంతో థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 21న తెలుగుతో పాటు తమిళ్ , హిందీ , కన్నడ , మలయాళంలో రిలీజ్  చేయనున్నట్లు  మేకర్స్ ప్రకటించారు.

శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి తేజ్ (Sai Dharam Tej) సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics