‘ఫాషన్ డిజైనర్’ రిలీజ్ డీటెయిల్స్ ...

Friday,May 05,2017 - 07:30 by Z_CLU

ముప్పై సంవత్సరాల క్రితం ‘లేడీస్ టైలర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వంశీ ప్రెజెంట్ ఆ సినిమాకు సీక్వెల్ గా ‘ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. సుమంత్ అశ్విన్ హీరోగా అనీషా ఆమ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్శ హీరోయిన్స్ గా మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది…


గోదావరి అందాల మధ్య రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.. లేటెస్ట్ గా ఈ సినిమాలోని 4 పాటలను రిలీజ్ చేసిన యూనిట్ రేపు 5 పాట ను రిలీజ్ చేయబోతున్నారు.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను జూన్ 2న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్…