Pakka Commercial మొదటి రోజు కలెక్షన్స్

Saturday,July 02,2022 - 02:07 by Z_CLU

యాక్షన్ హీరో గోపీచంద్, విలక్షణ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు మారుతి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘పక్కా కమర్షియల్’. టైటిల్ కు తగ్గట్టుగానే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా  ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా గోపీచంద్ నటన , రాశి ఖాన్న కేరెక్టర్ , అజయ్ ఘోష్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాలో కొన్ని సన్నివేశాలు  ప్రేక్షకులను హిలేరియస్ గా నవ్విస్తూ అలరిస్తుండటంతో మొదటి రోజు మంచి వసూళ్ళు అందుకుంది ‘పక్కా కమర్షియల్’.

 

 

మొదటిరోజు ఈ సినిమాకు 6.3 కోట్ల గ్రాస్ వచ్చింది. గోపీచంద్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమా ఇదని మేకర్స్ ప్రకటించారు. ఈ వీకెండ్ ముగిసేసరికి  10 కోట్లకు పైగా గ్రాస్ దాటే అవకాశం ఉంది. గీతా ఆర్ట్స్ , యూవీ క్రియేషన్స్ బేనర్స్ పై బన్నీ వాస్ నిర్మించిన ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics