గోపీచంద్ సరసన మిల్కీబ్యూటీ

Wednesday,September 25,2019 - 12:23 by Z_CLU

మ్యాచో హీరో గోపీచంద్ హీరో గా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్న భారీ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా ఎంపికయింది. తమన్నా గతంలో సంపత్ నంది దర్శకత్వం వహించిన ‘బెంగాల్ టైగర్’, రచ్చ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. సంపత్ నంది-తమన్న కాంబోలో ఇది మూడో చిత్రం. అటు గోపీచంద్ తో మాత్రం తమన్నాకు ఇదే ఫస్ట్ మూవీ

ఆమధ్య వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘గౌతమ్ నంద’ ఆశించిన విజయం సాధించలేదు. అందుకే ఈసారి ఓ స్పోర్ట్స్ డ్రామాను సిద్దం చేసుకున్నారు. సినిమాలో గోపీచంద్ కబడ్డీ ప్లేయర్ గా నటిస్తున్నాడని, కబడ్డీ నేపథ్యంలో కథ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ విషయంపై మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు.

చాణక్య సినిమాను రిలీజ్ కు రెడీచేసిన గోపీచంద్, రీసెంట్ గా బిను సుబ్రమణ్యం దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఈ సినిమా షెడ్యూల్ పూర్తయిన వెంటనే సంపత్ నంది సినిమా స్టార్ట్ అవుతుంది.