Pakka Commercial - ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,July 04,2022 - 12:38 by Z_CLU

గోపీచంద్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, మొదటి 3 రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం చెప్పుకోదగ్గ పాయింట్. దీనికి మొదటి కారణం మీడియం రేంజ్ బడ్జెట్ లో సినిమాను తెరకెక్కించడం, రెండో కారణం చాలా ఏరియాల్లో ఓన్ రిలీజ్ చేయడం.

గీతాఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి వారాంతం ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల 20 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. ఈ వసూళ్లతో సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు ప్రకటించింది యూనిట్.

ఈ సినిమా కోసం పబ్లిసిటీతో కలిపి అటుఇటుగా 35 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మేకర్స్. ఇందులో 32 కోట్లు కేవలం నాన్-థియేట్రికల్ (శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్, ఆడియో) రూపంలో వచ్చినట్టు తెలుస్తోంది. సో.. ఎలా చూసుకున్నా ఈ సినిమా ప్రాఫిట్ వెంచర్ కింద లెక్క.

ఈ సినిమాతో మారుతి మరోసారి బ్యాంకబుల్ డైరక్టర్ అనిపించుకున్నాడు. కంటెంట్ పై విమర్శలున్నప్పటికీ, అతడి టేకింగ్, గోపీచంద్, రాశిఖన్నా ఇమేజ్ ఈ సినిమాను గట్టెక్కించాయి. అలా విడుదలైన 3 రోజుల్లోనే ఈ సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అనిపించుకున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics