Pakka Commercial ఆకట్టుకుంటున్న'అందాల రాశి' ప్రోమో

Saturday,May 28,2022 - 12:01 by Z_CLU

AndalaRaasi Song Promo from PakkaCommercial out

గోపీచంద్ హీరోగా ద‌ర్శ‌కుడు మారుతి తెరకెక్కుతున్న ‘పక్కా కమర్షియల్’ జులై 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో  జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి బ‌న్నీ వాసు నిర్మాత‌గా రూపొందుతున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ జూన్ 1న రిలీజ్ కానుంది. తాజాగా ఈ పాట‌కు సంబంధించిన టీజ‌ర్ విడుదలై, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

సాంగ్ లో గోపీచంద్ , రాశీ ఖన్నా చాలా గ్లామర్ గా కనిపిస్తున్నారు. హై స్టాండర్డ్స్ క్వాలిటీ తో ఈ సాంగ్ షూట్ చేశారని ప్రోమో చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సాంగ్ కోసం భారీ సెట్స్ వేశారు.  జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందించిన ఈ సాంగ్ కి కృష్ణ కాంత్ లిరిక్స్ ఇచ్చాడు. మరో మూడు రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సాంగ్ మంచి వ్యూస్ రాబట్టి సూపర్ హిట్ నంబర్ అనిపించుకోవడం ఖాయమనిపిస్తుంది.

ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.  సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపీచంద్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.  SKN సహ నిర్మాత‌.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics