తమన్ – త్రివిక్రమ్ ఈసారి కూడా అంతేనా..?

Wednesday,September 25,2019 - 09:02 by Z_CLU

‘అరవింద సమేత’ – త్రివిక్రమ్, తమన్ ఫస్ట్ టైమ్ కొలాబొరేట్ అయిన సినిమా. ఈ సినిమాకి ముందు అసలు వీళ్ళిద్దరూ కలిసి సినిమానే చేయలేదు. ‘చేస్తే ఇలా ఉంటుందా..?’ అనిపించింది అరవింద సమేత రిలీజయ్యాక… అందుకే ఈ మాటల మాంత్రికుడు తన నెక్స్ట్ సినిమాకి ఇంకో ఆప్షన్ కూడా ఆలోచించలేదు తమన్ తప్ప… అయితే అరవింద సమేత మ్యాజిక్ ‘అల..’ కి కూడా రిపీటవుతుందా…?

‘అరవింద సమేత’ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడు జస్ట్ సాంగ్స్ కంపోజ్ చేశామా లేదా…? అన్నట్టుగా కాకుండా కంప్లీట్ గా సినిమాతో పాటే ట్రావెల్ అయ్యాడు తమన్. ఆ సినిమా థీమ్ అలాంటిది. సినిమాలోని సన్నివేశాల వరకు వస్తే కనీసం రిఫరెన్స్ తీసుకుని చెప్పడానికి కూడా వీలుకాదు. అందుకే ఆల్మోస్ట్ త్రివిక్రమ్ తో ట్రావెల్ అయ్యాడు తమన్. కొన్ని ట్యూన్స్ ని సెట్స్ పైనే కంపోజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ‘అరవింద సమేత’ ఆల్బమ్ కానీ, BGM కానీ ‘అది వేరంతే’ అనిపించుకుంది…

అయితే ‘అల.. వైకుంఠపురం’ కోసం కూడా అలాంటి మ్యాజిక్ నే జెనెరేట్ చేయబోతున్నాడా తమన్. నిజానికి తమన్ ఏం చేయాలనుకున్నా ఇక్కడ త్రివిక్రమ్ ఎలాంటి సినిమా చేస్తున్నాడన్న పాయింటే పైనే డిపెండ్ అయి ఉంటుంది. బన్ని కోసం తమన్ ఏ స్థాయి లో మ్యూజిక్ కంపోజ్ చేస్తాడన్నది ఫ్యాన్స్ కి పరిచయమే… అయితే దీనికి త్రివిక్రమ్ డోస్ కూడా ఆడ్ అవుతుండటం తో ఈసారి ఫ్యాన్స్ లో అంచనాలు నానాటికీ పెరుగుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ ని రికార్డ్ చేసేసిన తమన్ ఈసారి కూడా ఏదో కొత్తగా ట్రై చేశాడనే అనిపిస్తుంది. ‘అరవింద సమేత’ సాంగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మ్యూజిక్ కంపోజర్ మరి ఈసారి కూడా ఆ రేంజ్ ని రీచ్ అవుతాడా..?చూడాలి ఫ్యాన్స్ లో రోజు రోజుకి పెరుగుతున్న అంచనాలను తమన్ ఏ స్థాయిలో అందుకుంటాడో…