హాలీడేస్ మోడ్ లో పూరి మెహబూబా టీమ్

Thursday,January 11,2018 - 11:38 by Z_CLU

పూరి ఆకాష్ హీరోగా నటిస్తున్న ‘మెహబూబా’ హైదరాబాద్ షెడ్యూల్ కి సక్సెస్ ఫుల్ గా ప్యాకప్ చెప్పేసింది. ప్రస్తుతం సంక్రాతి హాలీడేస్ లో మెహబూబా టీమ్, పండగ తరవాత నెక్స్ట్ షెడ్యూల్ తో బిజీ కానుంది. 1971 లో జరిగిన ఇండో పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆకాష్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

అల్టిమేట్ యాక్షన్ & లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పంజాబ్, రాజస్థాన్, హైదరాబాద్ లాంటి ఎగ్జోటిక్ లొకేషన్ లలో షూటింగ్ జరుపుకుంటుంది. పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. పూరి మార్క్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఆకాష్ ఈ సినిమాతో కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.