పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ ఫస్ట్ డే US కలెక్షన్స్

Thursday,January 11,2018 - 12:16 by Z_CLU

పవర్ స్టార్ ‘అజ్ఞాతవాసి’ ఓవర్ సీస్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజైన ఈ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసే పనిలో పడింది. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ పవర్ ఫుల్ ఎంటర్ టైనర్ ఫస్ట్ డే 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి ‘ఖైదీ నం 150’ రికార్డ్ ని క్రాస్ చేసి సెకండ్ ప్లేస్ లో నిలిచింది.

రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా వర్కింగ్ డే వసూళ్ళే ఈ రేంజ్ లో ఉంటే, వీకెండ్ కి మరిన్ని రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్.

ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకి త్రివిక్రమ్ డైరెక్టర్. కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటించిన అజ్ఞాతవాసికి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.