

Friday,September 08,2023 - 02:01 by Z_CLU
ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. తండ్రి పాత్రధారి గోపరాజు రమణ “ప్రతి తండ్రి నన్ను చూసి నేర్చుకోవాల. అమ్మ పాలిచ్చి పెంచుద్ది, అయ్య మందిచ్చి ఓదార్చాల. చెప్పు నాన్న ఏం తాగుతావు?” అని అడగగా.. కిరణ్ అబ్బవరం “బీర్ ఓకే” అని చెప్పే సంభాషణతో ట్రైలర్ సరదాగా ప్రారంభమైంది. “సన్నీ లియోన్ హస్బెండ్ నాకు ఇన్ స్పిరేషన్”, “పెళ్ళయితే మీ పెళ్ళాలకు ప్రెగ్నెన్సీ రావాల్సింది, మీకు వచ్చింది ఏంటి?” వంటి డైలాగ్స్ 100 శాతం వినోదం గ్యారెంటీ అనే నమ్మకం కలిగిస్తున్నాయి. హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు కూడా హాస్యంతో కూడి మెప్పిస్తున్నాయి. కలిసి కాలేజ్ లో చదువుకున్న వారు చాలా కాలం తరువాత కలవడం, సనా(నేహా)ని మెప్పించడానికి రూల్స్ రంజన్ లా ఉండే మనో రంజన్ కాస్తా పబ్ రంజన్ గా మారడం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అసలు రూల్స్ రంజన్, పబ్ రంజన్ గా ఎందుకు మారాడు? మందు వల్ల అతని ప్రేమకి, స్నేహానికి వచ్చిన సమస్య ఏంటి? అతని ప్రేమ ఫలించిందా? అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ సినిమాపై అంచనాలు పెంచింది ట్రైలర్. అమ్రిష్ గణేష్ పాటలలోనే కాదు నేపథ్య సంగీతంలో కూడా తన ప్రతిభ కనబరిచాడాని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది అలాగే ట్రైలర్ లో విజువల్స్, నిర్మాణ విలువలు బాగున్నాయి.
పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా దులీప్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ గా ఎం. సుధీర్ వ్యవహరిస్తున్నారు.
Thursday,July 20,2023 12:56 by Z_CLU
Wednesday,April 05,2023 05:32 by Z_CLU
Monday,March 20,2023 11:09 by Z_CLU
Monday,February 20,2023 11:12 by Z_CLU