వెంకీ తో పూరి ఫిక్స్ ....

Thursday,December 29,2016 - 04:30 by Z_CLU

‘ఇజం’ తర్వాత నెక్స్ట్ సినిమాకు కాస్త టైం తీసుకుంటున్న స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎట్టకేలకి తన నెక్స్ట్ సినిమాను సెట్స్ పై పోతున్నాడు. మొన్నటి వరకూ యంగ్ హీరో లతో ఓ సినిమా ప్లాన్ చేసుకున్న పూరి హఠాత్తుగా సీనియర్ హీరో తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం.

  ఇప్పటికే సీనియర్ హీరో నాగార్జున తో రెండు సినిమాలు చేసిన అనుభవం తో త్వరలో విక్టరీ వెంకటేష్ ను కూడా డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడట పూరి. ఈ కాంబో ఆల్మోస్ట్ కంఫర్మ్ అనే టాక్ ప్రెజెంట్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మరి లేటెస్ట్ గా ‘గురు’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంకీ నెక్స్ట్ పూరి తోనే సెట్స్ పైకి వెళ్తాడా? లేదా కిషోర్ తిరుమల తర్వాత తన 75 సినిమాను పూరి తో చేస్తాడా? చూడాలి..