బాబాయ్ -అబ్బాయ్ ఐదు సినిమాలు !

Thursday,February 04,2021 - 04:39 by Z_CLU

దగ్గుబాటి హీరోల నుండి ఈసారి ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ అందనుంది. అవును బాబాయ్ అబ్బాయ్ కలిసి ఈ ఏడాది ఓ ఐదు సినిమాలతో థియేటర్స్ లోకి రాబోతున్నారు. ఇప్పటికే వెంకటేష్ -రానా నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ డేట్స్ లాక్ చేసుకొని రెడీ అవుతున్నాయి. వెంకటేష్ నటించిన ‘నారప్ప’ ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకొని మే 14 న రిలీజ్ కి రెడీ అవుతుంది. అలాగే వరుణ్ తేజ్ తో కలిసి వెంకీ నటిస్తున్న ‘F3’ సినిమా ఆగస్ట్ 27న విడుదలకానుంది.

ఇక రానా నుండి ఏకంగా ఈ ఇయర్ మూడు సినిమాలు రానున్నాయి. ఇప్పటికే రానా హీరోగా నటించిన రెండు సినిమాలు రిలీజ్ డేట్ లాక్ చేసేసుకున్నాయి. ‘అరణ్య’ మార్చ్ 26 న ప్రేక్షకుల ముందుకు రానుండగా ‘విరాట పర్వం’ ఏప్రిల్ 30 న రిలీజ్ అవుతుంది. ఇవి కాకుండా పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకొని రానా చేస్తున్న మరో సినిమా కూడా ఈ ఏడాది ఎండింగ్ లోపే థియేటర్స్ లోకి రానుంది. ఇలా దగ్గుబాటి ఫ్యామిలీ హీరోల నుండి ఓ ఐదు సినిమాలు కనువిందు చేయనున్నాయి. మరి ఈ సినిమాతో బాబాయ్ -అబ్బాయ్ ఎలాంటి హిట్స్ సొంతం చేసుకుంటారో వెయిట్ అండ్ సీ.

Also Check అబ్బాయ్ -బాబాయ్ ఒకే హీరోయిన్ !