మిస్సింగ్ హీరోస్ - 2016

Thursday,December 29,2016 - 05:55 by Z_CLU

2016 లో సిల్వర్ స్క్రీన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. స్టార్ హీరోలు మినిమం రెండేసి సినిమాలతో సక్సెస్ రేషియోని బ్యాలన్స్ చేసుకున్నారు… కానీ అంత ఫాస్ట్ పేజ్ లోను తెలుగు సినిమా పై కొందరు హీరోల అకౌంట్ లో కనీసం ఒక్క రిలీజ్ కూడా లేకుండానే 2016 క్లోజ్ అయిపోయింది.

ravi-teja-2016-missing-zee-cinemalu

2015 లో సంపత్ నంది డైరెక్షన్ లో వచ్చిన బెంగాల్ టైగర్ తరవాత మాస్ మహారాజ్ నెక్స్ట్ సినిమా మళ్ళీ సెట్స్ పైకి రాలేదు. బెంగాల్ టైగర్ తరవాత లాంగ్ బ్రేక్ తీసుకున్న రవితేజ, లాస్ట్ ఇయర్ మొత్తం రిలాక్స్ మోడ్ లోనే గడిపేశాడు. ప్రస్తుతం నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం డిస్కషన్స్ లో ఉన్న రవితేజ ఏ సినిమాతో సెట్స్ పైకి వస్తాడో ప్రస్తుతానికి సస్పెన్సే.

prabhas-2016-misssing-zee-cinemalu

ఎప్పుడో జూలై 2015 లో రిలీజయింది బాహుబలి. అప్పటి నుండి ఇప్పటిదాకా డార్లింగ్ ని మళ్ళీ స్క్రీన్ పై చూడలేకపోయారు ఫ్యాన్స్. అయినా ఇయర్ గడిచిపోయింది కాబట్టి డిస్కస్ చేసుకుంటున్నాం కానీ, నిజానికి 2016 లో ప్రభాస్ సినిమా రిలీజ్ ఉండదు అన్న విషయం, రాజమౌళి బాహుబలి కంక్లూజన్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడే క్లారిటీ వచ్చేసింది.

akhil-2016-missing-zee-cinemalu

 హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ‘అఖిల్’ సినిమాతో ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా తెరంగేట్రం చేసిన అక్కినేని అఖిల్, తన రెండో సినిమా విషయంలో అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేదు. ఏముంది స్టోరీ డిస్కషన్స్ లో ఉండగానే 2016 బ్లాంక్ గా గడిచిపోయింది. 2017లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన రెండో సినిమా చేయబోతున్నాడు.

gopichand-2016-missing-zee-cinemalu

2015 లో రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘సౌఖ్యం’ తరవాత గోపీచంద్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనేలేదు. 2016 బిగినింగ్ లో లాంచ్ అయిన ఆక్సిజన్ ఓ వైపు మేకింగ్ ప్రాసెస్ లోనే ఉంది. ఈ లోపు 2016 గుడ్ బై చెప్పేసింది. తక్కిన సినిమాల విషయం అయితే కన్ఫం గా తెలీదు కానీ, ఆక్సిజన్ మాత్రం 2017 లో రిలీజ్ గ్యారంటీ.

rana_daggubati-2016-missing-zee-cinemalu

 2015 లో భళ్లాలదేవుడిగా కనిపించిన రానా, మళ్ళీ తెలుగు సినిమా స్క్రీన్ పై కన్పించలేదు. అయినా రానాకి, ప్రభాస్ కి పెద్దగా తేడా లేదు. గత మూడేళ్ళుగా సేం ఫుడ్, సేం సెట్, సేం టు సేం వర్కవుట్స్,… చిన్న తేడా ఏమైనా ఉంటే రానా… అప్పుడప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా ఒకటి, రెండు తమిళ సినిమాలు చేసుకున్నాడు.  ప్రస్తుతానికి భల్లాలదేవుని గెటప్ కి ప్యాకప్ చెప్పిన రానా, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫుల్ టైం ఫోకస్ పెట్టేశాడు. ఏది ఏమైనా  2017 లో రానా అకౌంట్ లో రెండు సినిమాలు మాత్రం గ్యారంటీగా పడతాయి.

varun-tej-2016-missing-zee-cinemalu

 2015 లో కంచె, లోఫర్ సినిమాలతో ఫాంలోకొచ్చాడు వరుణ్ తేజ్. ఆ తరవాత అదే స్పీడ్ తో 2016 లోను శ్రీనువైట్ల తో మిస్టర్, శేఖర్ కమ్ములతో ఫిదా సినిమాలతో సెట్స్ పైకి వచ్చినా, కాలిగాయంతో కొన్ని రోజులు షూటింగ్ కి సెలవు ప్రకటించేశాడు వరుణ్ తేజ్. ఏముంది… వరుణ్ తేజ్ సెట్స్ పైనే ఉన్నాడు ఈ లోపు 2016 అలా వచ్చింది ఇలా వెళ్ళిపోయింది.. చూస్తూ చూస్తూ వరుణ్ తేజ్ 2016 డైరీ ఒక్క రిలీజ్ కూడా లేకుండానే క్లోజ్ అయిపోయింది.

sudheer-babu-2016-missing-zee-cinemalu

 2015 లో రిలీజైన ‘భలే మంచి రోజు’ సినిమా తరవాత సుధీర్ బాబు నెక్స్ట్ సినిమా లాంచ్ అయిందన్న ఇన్ఫర్మేషన్ కూడా లేకుండానే ఇయర్ దాటిపోయింది. అటు బాలీవుడ్ లో ‘బాగి’ సినిమాతో విలన్ గా లాంచ్ అయినా టాలీవుడ్ రిజిస్టర్ లో మాత్రం 2016 లో సుధీర్ బాబు ఆబ్సెంటే. ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటిస్తున్న సుధీర్ బాబు.. 2017 ని పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు.