వెంకటేష్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అప్పుడే ?

Sunday,September 29,2019 - 12:02 by Z_CLU

బాబీ డైరెక్షన్ లో  నాగ చైతన్య తో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు వెంకటేష్. ఈ సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉంది. ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపు మరో సినిమాను ఫైనల్ చేసేసుకున్నాడట వెంకీ.  నెక్స్ట్ తరుణ్ భాస్కర్ తో సినిమా చేయనున్నాడనే టాక్ వినిపిస్తుంది.

వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని, సినిమాలో వెంకటేష్ హార్స్ రేస్ ట్రైనర్ గా కనిపిస్తాడని అంటున్నారు.

ప్రస్తుతానికైతే ఈ వార్తపై మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు. అన్నీ అనుకున్నట్లే జరిగితే డిసెంబర్ లో వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా అనౌన్స్ చేస్తారనే టాక్  నడుస్తుంది. మరి వెంకీ నెక్స్ట్ చేయబోయేది తరుణ్ భాస్కర్ సినిమాయేనా..?  తెలియాలంటే మూడు నెలలు ఆగాల్సిందే.