వెంకీ వాయిస్ ఓవర్ తో 'శ్రీనివాస కళ్యాణం'

Saturday,August 04,2018 - 02:44 by Z_CLU

కాన్సెప్ట్ టీజర్, ట్రైలర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసి మోస్ట్ ఎవైటింగ్ ఫ్యామిలీ మూవీగా మారిన ‘శ్రీనివాస కళ్యాణం’ కు మరో స్పెషల్ ఎలిమెంట్ యాడ్ అయింది. ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన  విక్టరీ వెంకటేష్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. వెంకీ వాయిస్ ఓవర్ తోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఇటివలే  ‘శ్రీనివాస కళ్యాణం’ కోసం కాస్త టైం కేటాయించి వాయిస్  ఓవర్ అందించాడు విక్టరీ.

నితిన్ సరసన రాశి ఖన్నా , నందిత శ్వేతా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో  గిరి బాబు, ప్రకాష్ రాజ్, జయప్రద, నరేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఆగస్ట్ 9న థియేటర్స్ లోకి రానుంది..