కల్పనా చావ్లా బయోపిక్ లో ప్రియాంక చోప్రా

Monday,April 24,2017 - 06:09 by Z_CLU

బాలీవుడ్ లో లాంగ్ లాంగ్ బ్యాక్ సెట్ అయిన బయోపిక్స్ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ లో ప్రియాంక్ చోప్రా నటించుంది. ఈ సినిమా ప్రియా మిశ్రా డైరెక్షన్ లో తెరకెక్కనుంది.

కల్పనా చావ్లా గురించి దాదాపు ఏడేళ్ళుగా రీసర్చ్ చేస్తున్న ప్రియామిశ్రా మ్యాగ్జిమం ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. ఫస్ట్ విమెన్ ఆస్ట్రోనాట్ గా ఎంతో మందికి ఇన్స్ పిరేషన్ గా నిలిచిన కల్పనా చావ్లా ఫిబ్రవరి 2003 లో తన సెకండ్ ఎక్స్ పెడిషన్ లో కన్ను మూశారు. అలాంటి గొప్ప మహిళా బయోపిక్ లో నటిస్తున్నందుకు చాలా ఎక్జైటెడ్ గా ఉంది ప్రియాంక చోప్రా. మరి ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వస్తుందో చూడాలి.