వెడ్డింగ్ డేట్ లాక్ చేసుకున్న రణవీర్ - దీపిక పాడుకొనే

Thursday,May 24,2018 - 08:02 by Z_CLU

బాలీవుడ్ లో వెడ్డింగ్ సీజన్ నడుస్తుందా అనిపిస్తుంది. రీసెంట్ గా సోనమ్ కపూర్ – ఆనంద్ అహుజా ల పెళ్ళి తరవాత ఈ వరసలో బాలీవుడ్ లో సెన్సేషనల్ లవ్ జోడీ రణవీర్ సింగ్, దీపికా పాడుకొనేల పేరు వినిపిస్తుంది. బి టౌన్ లో చక్కర్లు కొడుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నవంబర్ 19 న ఈ లవ్ కపుల్, పెళ్ళి పీటలెక్కనున్నారు.

రీసెంట్ గా రణవీర్ సింగ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీలైనంత తొందరగా పెళ్ళి చేసుకోవాలని ఉందని కన్ఫమ్ చేశాడు. దాంతో ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ వీరి సినిమాల నుండి  పెళ్ళి పైకి మళ్ళింది. నిజానికి రణవీర్, దీపికా ల ప్లాన్ ప్రకారం వీరిద్దరి పెళ్ళి జూలై లోనే జరగాలి. కానీ ఇద్దరి సినిమాల కమిట్ మెంట్స్ వల్ల నవంబర్ 19 న వెడ్డింగ్ డేట్ ని లాక్ చేసుకున్నారు రణవీర్ దీపికా.

 

ఈ పెళ్ళి న్యూస్ ప్రస్తుతానికి అఫీషియల్ గా కన్ఫమ్ అయితే కాలేదు కానీ సోషల్ మీడియాలో ఈ న్యూస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మరి ఈ న్యూస్ కి దీపికా, రణవీర్ సింగ్ రియాక్ట్ అవుతారా..? లేకపోతే అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ లా సింపుల్ గా పెళ్ళి చేసుకుని, ఆ తర్వాత అనౌన్స్ చేస్తారా…? అనేది ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది.