అదే నా చిరకాల కోరిక - ఇలియానా

Monday,March 12,2018 - 01:45 by Z_CLU

ఇంట్రెస్టింగ్ సినిమాలతో కరియర్ ప్లాన్ చేసుకుంటుంది ఇలియానా. ప్రస్తుతం ఈ నెల 16 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ‘రైడ్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అయితే ఈ ప్రమోషన్ లో భాగంగా ఢిల్లీ వెళ్ళిన ఇలియానా, ఢిల్లీ తో తనకున్న అనుబంధం చాలా స్పెషల్ అని చెప్పుకుంది.

ఢిల్లీలో తనకంటూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లేకపోయినా, ఎప్పుడు ఢిల్లీకి వచ్చిన చాలా క్లోజ్ గా ఫీల్ అవుతానని చెప్పుకున్న ఇలియానా, ఇక్కడి వంటకాలన్నా, రోడ్లన్నా చాలా ఇష్టమని చెప్పుకుంది. ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా, ఎయిర్ పోర్ట్ వెళ్ళే దారిలో చాట్ తినడం అంటే చాలా ఇష్టమని, కాకపోతే ఇప్పటి వరకు ఆ అవకాశం దొరకలేదని ఫీల్ అయిన ఇలియానా, ఏదో ఒకరోజు ఎవరు గుర్తు పట్టకుండా, ఢిల్లీలో తప్పకుండా చాట్ తింటాను అని తన చిరకాల కోరికను బయట పెట్టింది.

 

ఢిల్లీ ట్రాఫిక్ కాస్త ఇబ్బందిగా అనిపించినా, రాత్రి పూట ఢిల్లీ రోడ్లపై డ్రైవ్ చేయడం అంటే చాలా ఇష్టమని చెప్పుకుంది ఇలియానా. అజయ్ దేవ్ గన్ ‘రైడ్’ సినిమాలో IT ఆఫీసర్ భార్యగా అజయ్ దేవ్ గన్ సరసన నటించిన ఇలియానా, ఈ సినిమాలో తను చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది.