పెళ్ళి విషయంలో రియాక్ట్ అయిన ఇలియానా

Tuesday,February 06,2018 - 07:45 by Z_CLU

ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ ‘రేడ్ ’ మూవీ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంది ఇలియానా. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ట్రైలర్ ఈ రోజు రిలీజైంది. అయితే ఈ సందర్భంగా మీడియా అడిగిన క్వశ్చన్స్ కి ఓపిగ్గా ఆన్సర్ ఇచ్చిన ఇలియానా, తన పెళ్ళి టాపిక్ వచ్చేసరికి సమాధానం చెప్పకుండానే మాట దాటేసింది.

గత కొన్ని రోజులుగా ఇలియానా తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ ని పెళ్ళి చేసుకుందనే న్యూస్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే ఇలియానా మాత్రం ఈ విషయంలో ఏ రకంగా స్పందించలేదు. దానికి తోడు రీసెంట్ గా క్రిస్మస్ రోజు ఇంస్టాగ్రామ్ లో  ఫోటో  షేర్ చేసిన ఇలియానా, ఆండ్రూ నీబోన్ ని హజ్బెండ్ అని మెన్షన్ చేయడంతో, ఈ టాక్ కి మరింత బలం తోడైంది.

 

https://www.instagram.com/p/BdCzeCUDtir/?taken-by=ileana_official

‘నా పర్సనల్ లైఫ్ తప్ప, ప్రపంచంలో చాలా విషయాలున్నాయి కాన్సంట్రేట్ చేయడానికి’ అని సున్నితంగా, నవ్వుతూ రిప్లై ఇచ్చిన ఇలియానా, తన ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ లో కూడా చాలా  సంతోషంగా ఉన్నానని చెప్పుకుంది.