సింపుల్ గా జరిగిన ప్రియమణి పెళ్లి వేడుక

Wednesday,August 23,2017 - 04:21 by Z_CLU

హీరోయిన్ ప్రియమణి  పెళ్ళి వేడుక చాలా సింపుల్ గా జరిగింది. సౌత్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మంచి నటిగా గుర్తింపు ఉన్న ప్రియమణి ఇండస్ట్రియలిస్ట్ ముస్తఫా రాజ్ ను తన కుటుంబ సభ్యుల మధ్య బెంగళూరులోని రిజిస్టర్ మ్యారేజ్ లో ఈ రోజే పెళ్లి చేసుకున్నారు.

ముస్తఫా రాజ్, తనది వేర్వేరు మతాలు కావడంతో పెళ్లి వేడుకను సింపుల్ గా ప్లాన్ చేసుకున్నా, రేపు గ్రాండ్ గా రిసెప్షన్ జరుపుకోనున్నారు. ఈ రిసెప్షన్ లో కుటుంబ సభ్యులతో పాటు, మరికొంత మంది సెలెబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొననున్నారు.

ఇకపోతే పెళ్లి తరవాత కూడా తన సినిమా కరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టేది లేదని లాంగ్ బ్యాక్ క్లారిటీ ఇచ్చిన ప్రియమణి రిసెప్షన్ తరవాత జస్ట్ వన్ డే రెస్ట్ తీసుకుని, ఆల్ రెడీ సెట్స్ పై ఉన్న సినిమా షూటింగ్ లో పాల్గొననుంది. ప్రస్తుతం మలయాళంలో 3 సినిమాల్లో నటిస్తుంది ప్రియమణి.