వైభవంగా జరిగిన 'జీ సినీ అవార్డ్స్ 2020' వేడుకలు

Monday,January 13,2020 - 03:03 by Z_CLU

జీ సినీ అవార్డ్స్ తెలుగు 2020 వేడుక ఘనంగా జరిగింది. జనవరి 11 న జరిగిన ఈ ఈవెంట్ లో టాలీవుడ్ మేటి తారాగణమంతా ఒక్కచోట చేరి ఈ వేడుకలను మరింత విజయవంతం చేశారు. మెగాస్టార్ మొదలు నీల్ నితిన్ ముకేష్ వరకు టాప్ స్టార్స్ అటెండ్ అయిన ఈ ఈవెంట్ కన్నుల పండగగా జరిగింది. దానికి తోడు ఒక్కో కేటగిరీలో గతేడాది ప్రతిభ చూపించిన స్టార్స్ ప్రెస్టీజియస్ జీ సినీ అవార్డులు అందుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాకి గారు ‘బెస్ట్ యాక్టర్’ గా అవార్డు అందుకున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా మెగాస్టార్ లోని కంప్లీట్ యాక్టర్ ని మరోసారి స్క్రీన్ ఆవిష్కరించింది.

ఇక ఫీమేల్ లీడ్ కేటగిరీ లో ‘బెస్ట్ యాక్టర్’ అవార్డును అందుకుంది సమంతా. గతేడాది రిలీజైన మజిలీ, ఓ బేబీ సినిమాల్లో సమంతా కనబరిచిన అసామాన ప్రతిభకి ఈ అవార్డు దక్కింది.

 

నాని : ‘జెర్సీ’ సినిమాతో ఫ్యాన్స్ కి మరింత ఫేవరేట్ అయ్యాడు నాని. అందుకే గతేడాది రిలీజైన ‘జెర్సీ’ సినిమాకి గాను ‘ఫేవరేట్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నాడు.

అల్లరి నరేష్ : ‘మహర్షి’ లో మహేష్ బాబు ఫ్రెండ్ గా నటించి మెస్మరైజ్ చేసిన అల్లరి నరేష్ ‘ బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ మేల్’ అవార్డును అందుకున్నాడు.

శ్రద్ధా శ్రీనాథ్ : ‘బెస్ట్ ఫైండ్ ఆఫ్ ది ఇయర్ ఫీమేల్’ అవార్డు అందుకుంది శ్రద్ధా శ్రీనాథ్.

బెస్ట్ కమెడియన్ అవార్డు : ఈ కేటగిరీ లో ఇద్దరు నటులు ఈ అవార్డు అందుకున్నారు. ‘బ్రోచే వారెవరురా’ సినిమాకి గాను రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఈ అవార్డును అందుకున్నారు.

ఫేవరేట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్ : ‘సాహో’ సినిమాకి గాను ఈ అవార్డు నీల్ నితిన్ ముకేష్ కి దక్కింది.

బెస్ట్ డెబ్యూ ఫీమేల్ : దొరసాని సినిమాకి గాను శివాత్మిక రాజశేఖర్ ఈ అవార్డు దక్కించుకుంది.

ఫేవరేట్ యాక్ట్రెస్ : మహర్షి సినిమాకి గాను పూజ హెగ్డే ఈ అవార్దు దక్కించుకుంది.

బెస్ట్ ప్రొడ్యూసర్ : ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి గాను ఈ అవార్డు లేడీ బాస్ ఛార్మీకి దక్కింది.

సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ : నెవర్ సీన్ బిఫోర్ మాస్ అవతార్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసినందుకు గాను రామ్ పోతినేని ఈ అవార్డు అందుకున్నాడు.

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ : ఈ అవార్డు ఇస్మార్ట్ శంకర్ సినిమాకి గాను మణిశర్మను వరించింది.

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ : సిద్ శ్రీరామ్ కి దక్కింది. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో ‘కడలల్లే…’ సాంగ్ కి గాను ఈ అవార్డు దక్కింది.

లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ : కళాతపస్వి  K. విశ్వనాథ్ గారు ఈ అవార్డు అందుకున్నారు.

బెస్ట్ డెబ్యూ మేల్ : దొరసాని సినిమాకి గాను ఆనంద్ దేవరకొండ ఈ అవార్డు అందుకున్నాడు.

బెస్ట్ సినిమాటోగ్రఫీ : సైరా నరసింహారెడ్డి సినిమాకి గాను రత్నవేలు ఈ అవార్డు అందుకున్నాడు.

ఫేవరేట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ : డియర్ కామ్రేడ్ సినిమాకి గాను ప్రభాకరన్ ఈ అవార్డును అందుకున్నాడు.

బెస్ట్ విలన్ : జార్జ్ రెడ్డి సినిమాకి గాను తిరువి ఈ అవార్డు అందుకున్నాడు.

బెస్ట్ స్క్రీన్ ప్లే : బ్రోచే వారెవరురా సినిమాకి గాను వివేక్ ఆత్రేయ ఈ అవార్డు అందుకున్నాడు.

ఇక నవీన్ పోలిశెట్టి నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ 3 కేటగిరీస్ లో అవార్డులు దక్కించుకుంది.  బెస్ట్ ఫైండ్ ఆఫ్ ది ఇయర్ గా నవీన్ పోలిశెట్టి అవార్డు అందుకుంటే, బెస్ట్ డైరెక్టర్ గా స్వరూప్ అందుకున్నాడు. ఈ సినిమా బెస్ట్ఫిలిం, బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీల్లో కూడా ఈ సినిమా అవార్డులు దక్కించుకుంది.