హిట్టు పడిందా..? రిపీట్ ఇట్!

Tuesday,August 06,2019 - 11:03 by Z_CLU

డైరెక్టర్స్ ని రిపీట్ చేస్తున్నారు హీరోలు. ఇది ఇండస్ట్రీలో కొత్తగా జరిగిన విషయం ఏదీ కాదు కానీ, ఓ సినిమా సక్సెస్ అవ్వగానే ఆ క్రేజ్ తగ్గక ముందే ఇంకో సినిమాని అనౌన్స్ చేస్తున్నారు. అలా ఓ హీరోతో సక్సెస్ అందుకున్న డైరెక్టర్, నెక్స్ట్ సినిమాని కూడా ఆ హీరో తోనే ప్లాన్ చేసుకుంటున్నారు.

‘గుణ 369’ సక్సెస్ కార్తికేయ కరియర్ కి లైఫ్ లైన్ లాంటిదే. మొదటి సినిమా ‘RX100’ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ హీరో ‘హిప్పీ’ తో ఒక్కసారిగా డిజప్పాయింట్ చేసేశాడు. ఈ వరసలో ఇంకో చిన్న తప్పు దొర్లినా, కార్తికేయ ఆల్మోస్ట్ ప్యాకప్ చెప్పాల్సిన సిచ్యువేషన్. అలాంటి టైమ్ లో పడింది ‘గుణ369’. ఈ సినిమా సక్సెస్ ‘కార్తికేయ’ ని మళ్ళీ ట్రాక్ లోకి తీసుకువచ్చింది. అందుకే ఈ దర్శకుడు అర్జున్ జంధ్యాలతో  ఇంకో సినిమాకి రెడీ అయ్యాడు ఈ క్రేజీ హీరో…

రీసెంట్ గా ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ వేదికపైనే ఈ సినిమా సీక్వెల్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. తన కరియర్ లోనే ఇప్పటి వరకు కనిపించని డైమెన్షన్ లో కనిపించిన ఎనర్జిటిక్ స్టార్ రామ్, కథ కూడా రెడీ అవ్వకుండానే, హిట్టిచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఇంకో సినిమాకి కమిట్ అయ్యాడు.

అడివి శేష్ కూడా ఆల్మోస్ట్ అంతే. రీసెంట్ గా ‘గూఢచారి’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. అందుకే ఈ సినిమా దర్శకుడు శశి కిరణ్ తిక్క నెక్స్ట్ సినిమా ‘మేజర్’ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది.