అల వైకుంఠపురములో ఫస్ట్ డే కలెక్షన్

Monday,January 13,2020 - 01:09 by Z_CLU

తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు బన్నీ. సంక్రాంతి కానుకగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాకు మొదటి రోజు భారీ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు తొలి రోజు 25 కోట్ల 56 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

అటు ఓవర్సీస్ లో అల వైకుంఠపురములో సినిమా సూపర్ హిట్ అయింది. ప్రీమియర్స్ తోనే 8 లక్షల డాలర్లు ఆర్జించిన ఈ సినిమా తాజాగా 1.34 మిలియన్ డాలర్ల వసూళ్లతో దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో కూడా బన్నీకి ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్స్
నైజాం – రూ. 6.01 కోట్లు
సీడెడ్ – రూ. 4.02 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.87 కోట్లు
ఈస్ట్ – రూ. 2.98 కోట్లు
వెస్ట్ – రూ. 2.41 కోట్లు
గుంటూరు – రూ. 3.41 కోట్లు
నెల్లూరు – రూ. 1.29 కోట్లు
కృష్ణా – రూ. 2.57 కోట్లు