‘ఇస్మార్ట్ శంకర్’ కి తర్వాత...?

Thursday,July 25,2019 - 12:02 by Z_CLU

డైరెక్టర్ దగ్గర కథ రెడీగా ఉండి హీరోని అప్రోచ్ అయి ఇంప్రెస్ చేసి తీసిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్ కాదు. పక్కా ప్లాన్డ్ గా తీసిన సినిమా. రామ్ తో సినిమా చేయాల్సిందే అనేది పూరి ప్లాన్ అయితే, ఈ సారి మాస్ మసాల ఉన్న సినిమానే చేయాలనేది రామ్ ప్లాన్.. ఈ ఇద్దరి ప్లానింగ్ కుదిరి ‘ఇస్మార్ట్ శంకర్’ తెరకెక్కింది. 

మాస్ ఎంటర్ టైనర్స్.. పూరి ట్రీట్ మెంట్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు కానీ, ఇక్క డ రామ్ గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. తన కరియర్ లో ఇలాంటి సినిమా చేయాలి అనేకన్నా, ఆడియెన్స్ తన నుండి ‘ఇస్మార్ట్ శంకర్ లాంటి  సినిమాని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారనే ఆడియన్స్ పల్స్ ని పర్ఫెక్ట్ గా పట్టేశాడు రామ్. 

‘ఇస్మార్ట్ శంకర్’ కి ముందు రామ్ కరియర్ కంప్లీట్ గా డిఫెరెంట్. సాఫ్ట్ క్యారెక్టర్స్.. మినిమం గ్యారంటీ కథలు…. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ రామ్ కరియర్ లో కొత్త పేజీని క్రియేట్ చేసింది. ఈ ఎనర్జిటిక్ స్టార్ డిసైడ్ అయితే థియేటర్స్ లో ఈ రేంజ్ వైబ్స్ కూడా క్రియేట్ చేయగలడా..? అనిపించాడు. అందుకే ఇప్పుడు రామ్ ఫ్యూచర్ సినిమాలపై ఆడియెన్స్ దృష్టి మళ్ళింది. 

రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ అనౌన్స్ చేశాడు పూరి… అంటే రామ్ ఇకపై కంప్లీట్ గా మాస్ సినిమాలపైనే ఫోకస్ పెట్టనున్నాడా..?. సాఫ్ట్ గా సాగిపోతున్న రామ్ కరియర్ లో టర్నింగ్ పాయింట్ లా మారింది ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమాతో సరికొత్త ఫేజ్ లోకి ఎంటరైన రామ్ మైండ్ లో ఏం నడుస్తుంది..? ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు..? చూడాలి…