ప్రసన్న ఇంటర్వ్యూ

Monday,November 20,2017 - 03:03 by Z_CLU

సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా నటించిన ‘జవాన్’ డిసెంబర్  1 గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. B.V.S. రవి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో  ప్రసన్న  విలన్  గా నటించాడు.  రీసెంట్ గా ‘డిటెక్టివ్’ సినిమాలోను ఇంట్రెస్టింగ్ రోల్ లో ఎట్రాక్ట్ చేసిన ప్రసన్న, ‘జవాన్’ సినిమా తరవాత తనకు మంచి గుర్తింపు రావడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సందర్భంగా తన కరియర్ గురించి, ‘జవాన్’ సినిమా గురించి ఆయన చెప్పిన మాటలు మీకోసం…

జవాన్ సినిమా నాకు అవసరం…

చాలా గ్యాప్ తరవాత తెలుగు సినిమా చేస్తున్నాను. ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. B.V.S. రవిగారు ఈ సినిమాలో నాకు ఈ రోల్ ఇచ్చినందుకు చాలా థాంక్స్.

చాలా ఫ్రీడమ్ ఉంటుంది…

విలన్ రోల్ చేసేటప్పుడు చాలా ఫ్రీడమ్ ఉంటుంది. హీరో క్యారెక్టర్ కైనా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ,  విలన్ కి అలా కాదు. విలన్ రోల్స్ చేయడం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. జవాన్ లో చాలా ఎంజాయ్ చేస్తూ నటించాను.

సాయి ధరంతేజ్ దానికి పెద్ద రీజన్..

సాయి ధరమ్ తేజ్ చాలా ఫ్రెండ్లీ గా ఉంటాడు. ఫస్ట్ టైమ్ కలిసినప్పుడే రెస్టారెంట్ కి వచ్చి సర్ ప్రైజ్ చేశాడు. ఆ తరవాత తెలుగు నేర్చుకోవడానికి కూడా చాలా ఎంకరేజ్ చేశాడు. ఈ రోజు ఈ మాత్రం తెలుగు మాట్లాడుతున్నానంటే దానికి సాయి ధరమ్ తేజ్ రీజన్.

 

తమన్ ఇంకా చాలా చేయాలి…

తమన్ నేను ఒకేసారి కరియర్ బిగిన్ చేశాం. తను బాయ్స్ లో నటించేటప్పుడు నేను కూడా అప్పుడే కరియర్ బిగిన్ చేశాను. ఆ తరవాత తమన్ మ్యూజిక్ కరియర్ తో బిజీ అయిపోయాడు. జవాన్ సినిమాకి చాలా మంచి ట్యూన్స్ ఇచ్చాడు. తమన్ ఇంకా చాలా హైట్స్ కి రిచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను.

అక్కడే కనెక్ట్ అయిపోయా…

నేను B.V.S. రవి గారిని కలవక ముందు ఆయన ఇంతకు ముందు చేసిన సినిమాల గురించి కానీ, ఆయన గురించి కానీ ఏమీ తెలీదు. కానీ ఫస్ట్ మీటింగ్ లోనే ఆయనతో కనెక్ట్ అయిపోయాను. స్క్రిప్ట్ కానీ, మనిషి కానీ, ఆయన స్టోరి న్యారేట్ చేసిన పధ్ధతి కానీ ఫస్ట్ మీటింగ్ లోనే ఆయనతో కనెక్ట్ అయిపోయాను. ఈ సినిమా చేసిన తరవాత నాకు హైదరాబాద్ లో ఒక బ్రదర్ ఉన్నాడు అనిపిస్తుంది.

ఫైనల్ గా జవాన్ గురించి…

డిసెంబర్ 1 న రిలీజవుతుంది జవాన్. అందరూ చూడదగ్గ సినిమా. మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నా…