PSV గరుడవేగ ఓవర్ సీస్ కలెక్షన్స్

Monday,November 20,2017 - 03:55 by Z_CLU

రాజశేఖర్ హీరోగా నటించిన PSV గరుడవేగ సక్సెస్ ఫుల్ గా థర్డ్ వీక్ లోకి ఎంటరయింది. ఫస్ట్ డే నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనిపించింది. అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఇటు యాక్షన్ మూవీ లవర్స్ ని ఒకేసారి ఇంప్రెస్ చేసేసింది. ఇక ఓవర్ సీస్ లో ఇప్పటికే హాఫ్ మిలియన్ USD వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది.

ఈ సినిమాలో రాజశేఖర్ సరసన పూజ కుమార్ నటించగా శ్రద్ధా దాస్ స్పెషల్ రోల్ లో ఎట్రాక్ట్ చేసింది. శ్రీచరణ్ పాకల మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి M. కోటేశ్వర రావు ప్రొడ్యూసర్.