అల్లు అర్జున్ ఇంటర్వ్యూ

Wednesday,May 02,2018 - 04:35 by Z_CLU

 ప్రస్తుతం టాలీవుడ్ లో ‘నాపేరు సూర్య’ సీజన్ నడుస్తుంది. అల్లు అర్జున్ ని మోస్ట్ అగ్రెసివ్ మిలిటరీ ఆఫీసర్ గా ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమా ఫ్యాన్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మే 4 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా గురించి బన్ని షేర్ చేసుకున్న ఇంట్రెస్టింగ్ విషయాలు…

ఆ విషయం నాకు తెలుసు…

నాకేమీ రాదు అన్న క్లారిటీ నాకుంది. అందుకే ప్రతిరోజు నేనేదో కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. మనకంటూ ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఉంటుంది. మనం మాట్లాడే విధానంలో, బాడీ లాంగ్వేజ్ లో… మనం అందులో ఉండిపోకూడదు బ్రేక్ చేయాలి.. మనల్ని మనం కొత్తగా ప్రెజెంట్ చేయాలి అనుకుంటూ ఉంటాను…

నాకు.. సూర్యకి సిమిలారిటీస్…

సినిమాలో సూర్యకి కోపం ఎక్కువగా వస్తుంది. రియల్ లైఫ్ లో నాకు కోపం తొందరగా వస్తుంది. ఎంత తొందరగా కోపం వస్తుందో, అంతే తొందరగా తగ్గిపోతుంది కూడా…

నా పేరు సూర్య సోషల్ మీడియా…

సినిమాలో ఆర్మీ అనేది జస్ట్ బ్యాక్ డ్రాప్ మాత్రమే. అది కాకుండా సినిమాలో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్ టైనర్. కొత్త క్యారెక్టరైజేషన్ చూస్తారు సినిమాలో…

అర్జున్ గారు సీజన్డ్ పర్ఫామర్…

ఇప్పటి వరకు 150 సినిమాలు చేసిన అర్జున్ గారి కాంబినేషన్ లో నేననే కాదు, ఎవరు పర్ఫామ్ చేసినా అక్కడ  పర్ఫామెన్స్ ఎన్హాన్స్ అవుతుంది. ఆ ఆ పర్టికులర్ సీన్ ఎన్హాన్స్ అవుతుంది. ఒక ప్రొఫెసర్ గా ఆయనెంత క్లాస్ గా పర్ఫామ్ చేశారో, ఒక సగటు యాక్టర్ ఎవ్వరికైనా అర్థమైపోతుంది.

సినిమాలో నా ఫేవరేట్ సాంగ్…

నార్మల్ గా ఓ వైపు సినిమా షూటింగ్ నడుస్తుంటుంది… మరోవైపు సాంగ్ కంపోజిషన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సినిమా విషయానికి వస్తే సాంగ్స్ ముందే వచ్చేయడంతో, మేము చాలా ప్లానింగ్ చేసుకోవడానికి చాన్స్ దొరికింది. ఈ ఆల్బమ్ లో నా మోస్ట్ ఫేవరేట్ సాంగ్ సైనిక…

మిలిటరీ పోర్షన్…

స్పెషల్ గా మిలిటరీ పోర్షన్ షూట్ చేయాల్సి వచ్చినప్పుడు పర్మిషన్ కోసం చాలా ఇబ్బంది పడ్డాం. ఒక్కోసారి జస్ట్ 1 డే షూట్ కోసం నెలరోజుల ముందు పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. చాలా కండిషన్స్ మధ్య షూట్ చేసేవాళ్ళం…

 

కొత్త దర్శకులతో…

ఈ సినిమా తరవాత డెఫ్ఫినేట్ గా కొత్త దర్శకులతో సినిమాలు చేస్తాను…

నేను చెప్పడం కాదు…

ఒక పోస్టర్ రిలీజైనప్పుడో.. ఒక టీజర్, లేదా ట్రైలర్ రిలీజయినప్పుడో సినిమా ఎలా ఉండబోతుందనేది ఆడియెన్స్ కి తెలిసిపోతుంది. ఇక నా విషయానికి వస్తే, ‘నా పేరు సూర్య’ సినిమా నేను గర్వించే సినిమా అవుతుంది.