సరికొత్త లుక్స్ లో ప్రభాస్

Wednesday,October 03,2018 - 05:37 by Z_CLU

యూరోప్ బ్యాక్ డ్రాప్ లో వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కనుంది ప్రభాస్ కొత్త సినిమా. మొన్నటి వరకు సాహో సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న ప్రభాస్, ఇప్పుడీ సినిమా కోసం కంప్లీట్ గా తన లుక్ ని మార్చేశాడు. రీసెంట్ గా యూరోప్ లోని అఫీషియల్స్ తో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఇది డెఫ్ఫినేట్ గా ప్రభాస్ కొత్త సినిమా లుక్ అని ఫిక్సయిపోయారు ఫ్యాన్స్.

రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని ఇటలీలో ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. ఈ నెల 6 నుండి రెగ్యులర్ షూటింగ్ బిగిన్ చేయనున్న మేకర్స్, ప్రస్తుతం ఈ షెడ్యూల్  ప్రిపరేషన్స్  లో ఉన్నట్టు  తెలుస్తుంది. ప్రభాస్ ని తన రీసెంట్ సినిమాలతో కంపేర్ చేస్తే, కంప్లీట్ గా డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్న మేకర్స్, లుక్స్ దగ్గరి నుండి సినిమా లొకేషన్స్ వరకు ప్రతీది గ్రాండ్ స్కేల్ పై ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. గోపీకృష్ణా మూవీస్, UV క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతుంది. అమిత్ త్రివేది ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.